NTV Telugu Site icon

Jagadish Reddy: విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్

Jagadesh Reddy

Jagadesh Reddy

Jagadish Reddy: విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లను ఎట్లా ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సోయి లేదన్నారు. సీఎం, మంత్రులకు అవగాహన లేదన్నారు. ఒక్క మంత్రికి వ్యవసాయంపై అవగాహన లేదని తెలిపారు. ఆంద్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసు అన్నారు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్ట్ ల మీద ఆధారపడాల్సిందే అన్నారు. క్రిష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారని తెలిపారు. నీళ్లు ఎట్లా లిఫ్ట్ చేయాలో తెలిసి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను నిర్మించారని తెలిపారు. విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటన్నారు. నేడు రామగుండం దగ్గర గోదావరి ఎట్లా ఉంది…? ప్రాణహిత ఎట్లా ఉందొ వెళ్లి చూడండి అని అన్నారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెప్తోందని అన్నారు. ఎల్లంపల్లి నుండి నీళ్ళు ఎట్లా అయినా రైతులకు ఇవ్వాల్సిందే అన్నారు. మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్,సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని తెలిపారు. కోదాడ,సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Read also: Ponnam Prabhakar: ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్..

మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని అన్నారు. ఎన్.డి.ఎస్.ఎ పేరుతో దొంగ సాకులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని తెలిపారు. ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. మెడిగడ్డ నుండి నీళ్లను లిఫ్ట్ చేయకుండా కన్నెపల్లి దగ్గర నుండే లిఫ్ట్ చేయవచ్చు ప్రభుత్వం వస్తే ఎట్లా అన్నారు. చేయాలో చూపిస్తామన్నారు. ఏ ప్రాజెక్టుకు ఏం కాలేదన్నారు. కాంగ్రెస్,బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడారని తెలిపారు. ఎన్.డి.ఎస్.ఏ హైదరాబాద్ రాకుండా ఢీల్లి నుండే కిషన్ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. సుందిళ్ళ, అన్నారం వెంటనే నింపాలని తెలిపారు. భద్రాచలం పట్టణానికి ఏదయినా ప్రమాదం జరిగితే పోలవరం వలనే జరుగుతుందని తెలిపారు. మీ పాత బాసులతోనే భద్రాచలం పట్టణానికి ప్రమాదం ఉందని తెలిపారు. ఇరిగేషన్ మంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వలనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డికి బాసులు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నా నేడు భద్రాచలంకు ఏం కాలేదన్నారు.
Komatireddy Vs Harish: అసెంబ్లీలో కోమటిరెడ్డి – హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం..