Site icon NTV Telugu

Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు..

Chaitanyapuri

Chaitanyapuri

Hyderabad: హైదరాబాద్ లోని చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు షాక్‌ కు గురయ్యారు. కిచెన్ లో తినే ఆహారంపై బొద్దింకలు తిరుగుతూ కనిపించడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. బహార్ బిర్యాని కేఫ్ లో కిచెన్ పరిసరాల్లో మురుగు నీటిని, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్ పైర్ అయిన పెప్పర్ సాస్, చాక్లెట్ ఫ్లేవర్ సిరప్ వాడుతున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అధికారులు ఫైర్‌ అయ్యారు. ఇలాంటి ఆహారాన్ని ప్రజలకు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇంత మురికి నీటిలో, కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తే ప్రజలు ఏమైపోవాలని మండిపడ్డారు. యాజమాన్యంతో మాట్లాడాలి పిలిపించాలని కోరారు. పలు చోట్లు హోటల్లు సీజ్ చేస్తున్నా యాజమాన్యం తమ వైఖరి మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్‌ ను సీజ్‌ చేస్తామని తెలిపారు.
Rebal Star : ప్రభాస్ నెక్ట్స్ 5 సినిమాలు.. 5 విభిన్న కథలు..

Exit mobile version