NTV Telugu Site icon

Hyderabad: అమీర్ పేట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. ఎక్స్పైర్ అయినా సర్టిఫికెట్స్ తో..

Ameerpet

Ameerpet

Hyderabad: హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అమీర్ పేట్ లోని పలు స్వీట్ షాప్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ వాసిరెడ్డి ఫుడ్స్, విన్నూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు ఫైర్ అయ్యారు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని ఇలాంటివి ప్రజలకు ఎలా వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. FSSAI సర్టిఫికెట్స్ ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ కూడా చేయించుకోలేదని యాజమాన్యం పై మండిపడ్డారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. షాప్‌ సీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. షాప్‌ యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా షాప్ లను కొనసాగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీపావళి పండుగ రానున్న సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. స్వీట్ షాపుల్లో ఎక్కడ చూసిన ఎక్స్ పైర్ అయిన ఫుడ్ గుర్తుస్తున్నట్లు తెలిపారు. షాప్ యాజమాన్యం ఫుడ్ పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయినా ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ను ఇలాగే కొనసాగిస్తే షాప్ లను సీజ్ చేసి, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
CM Revanth Reddy: బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం..

Show comments