Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించామని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 1999 లో మేము ఖరీదు చేశామన్నారు. అనుమతితో కట్టాం.. పట్టా ల్యాండ్ అది అన్నారు. తోట ఉంది అక్కడ..ఇరిగేషన్ అధికారులను పిలిచి చూపించా అన్నారు. కాంపౌండ్ వాల్ కూడా లేదన్నారు. ఆనాడు కలక్టర్..ఇరిగేషన్ అధికారులు ఆదేశాల మేరకే కట్టానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. ప్రభుత్వం చర్యలకు సహకరిస్తామన్నారు. మా ఫాం హౌస్ తప్పుడు నిర్మాణం ఐతే.. ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే నేనే కూల్చేస్తా అన్నారు. నేను అక్కడే ఉండాలని ఏం లేదన్నారు. మా తాత కొన్న భూముల్లోనే రీజినల్ రింగ్ రోడ్డు పోతుందన్నారు. మాకు అంత ల్యాండ్ ఉంది.. ఈ చిన్న దానికి తప్పు చేయాల్సిన అవసరంలేదన్నారు. సీఎం చెరువుల్లో ఆక్రమణలు కూల్చుతున్నారని.. దాన్ని స్వాగతిస్తూ మా అబ్బాయి పేరుతో ల్యాండ్ ఉందన్నారు.
Read also: Ponnam Prabhakar: ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు..
కాంపౌండ్ వాల్ కట్టలేదన్నారు. జీవో 111 లో చాలా మంది ఉన్నారు. ఎంపీలు..పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు. మాది ftl లో లేదు.. బఫర్ జోన్ లో కూడా లేదన్నారు. గుట్ట మీద ఉంది కాబట్టి అందరూ దృష్టి పడిందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే నా భవనం కూల్చేయండి అని తెలిపారు. కేటీఆర్ కి విషయం తెలియక చెప్తున్నాడన్నారు. మహేందర్ రెడ్డి నిబంధనల మేరకు కట్టాడు అని తెలియదన్నారు. నిబంధనలకు అనుకూలంగా లేకుంటే కూల్చుతామని సీఎం అన్నారు.. తప్పుగా ఉంటే కూల్చండి అన్నారు. మొయినాబాద్ లో చాలా మందికి చెరువుల్లో ఫాం హౌస్ లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాది తప్పు అని నిరూపిస్తే నేనే కూల్చేస్తాం అన్నారు. ప్రభుత్వ భూముల లోకి మేము వెళ్ళమన్నారు. మాకు తెలుసు.. అది ఎప్పటికైనా కలుస్తారు అన్నారు.
Tummala Nageswara Rao: రైతు రుణ మాఫీ పై యాప్ పని ప్రారంభించింది..