NTV Telugu Site icon

Hydraa: మల్కాపూర్ చెరువులో భవనం కూల్చివేత.. హోంగార్డుకు తీవ్ర గాయాలు

Hydera

Hydera

Hydraa: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలు చోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత చేపట్టారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. చెరువు నీటి మధ్యలో నిర్మించిన భవనాన్ని బ్లాస్టింగ్ చేసే క్రమంలో భవనం నుంచి ఒక్కసారిగా ఒక రాయి స్పీడ్ గా వచ్చి సమీపంలో నిలబడి వున్న హోంగార్డు గోపాల్‌కు తగిలింది. దీంతో గోపాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తలపై నుంచి తీవ్రంగా రక్తం కారడంతో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. గోపాల్ పరిస్థితి నిలకడగానే ఉందని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఆపరేషన్ మూసీ జోరుగా సాగుతోంది. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మూసీ వద్ద ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే కొనసాగుతోంది. పునరావాసం కోసం అధికారులు పేదల వివరాలను సేకరించడం ప్రారంభించారు. పునరావాసం తర్వాతే ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మూసీ నది ఆక్రమణల నుంచి బయటపడేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. మూసి నదిలో 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. అయితే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువ ఆక్రమణలను అధికారులు గుర్తించారు.
Jagtial Crime: ఎస్సై కొట్టిందని నిప్పంటించుకున్న వ్యక్తి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..