NTV Telugu Site icon

CM Revanth Reddy Brother: సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy Brother: హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రాపై విమర్శలు వస్తున్నా మొదటి నుండి దూకుడుగా ముందుకు సాగుతుంది. అక్రమార్జనకు పాల్పడిన వారిపై సామాన్యులు, పేదలు, సినీ, రాజకీయ ప్రముఖులు కొరడా ఝుళిపిస్తున్నారు. పేదవారైనా, సెలబ్రిటీలైనా తనకు ఒకటేనని ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసి హైడ్రా నిరూపించుకుంది. ఈ క్రమంలో తాజాగా హైడ్రా మరో సంచలనం సృష్టించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి నోటీసులు జారీ అయ్యాయి.

Read also: Etela Rajender: హైడ్రా అంటే ఓ డ్రామా.. ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా.. తాజాగా బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తన దృష్టిలో అందరూ సమానమే అంటూ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసంపై హైడ్రా నోటీసులు పెట్టింది. మాదాపూర్‌ అమర్‌ కోఆపరేటివ్‌ సొసైటీలోని తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వారికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్‌ కింద నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. సెరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తహసీల్దార్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దుర్గంచెరు పక్కనే ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ నివాసితులకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేసేందుకు నెల రోజుల గడువు కూడా ఇచ్చారు.
Harish Rao: ఊరంతా విషజ్వరాలే.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హరీష్ రావు ఆగ్రహం

Show comments