NTV Telugu Site icon

AV Ranganath: నేడు అమీన్ పూర్ లో పర్యటించనున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్..

Av Ranganath

Av Ranganath

AV Ranganath: సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌ పూర్‌ లో హైడ్రా కమీషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు. 350 ఎకరాల అమీన్ పూర్‌ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించనున్నారు. జీవ వైవిద్యంగా పేరు గాంచిన అమీన్ పూర్ పెద్ద చెరువు నేడు కబ్జాకోరాల్లో మునిగి తేలుతుందని స్థానిక సమాచారంతో కమీషనర్‌ రంగనాథ్‌ పర్యటించనున్నారు. చెరువు మధ్య నుండి రోడ్డు వేసిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌ పెద్ద చెరువు కబ్జా చేసిన వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అమీన్‌ పూర్‌ మున్సిపల్ పరిధిలోని షంబిని కుంట, శంబికుంట ,బంధన్ కొమ్ము చెరువు ,పెద్ద చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించనున్నారు. కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలించి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read also: Hydra Demolishing: గగన్ పహాడ్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..

మరోవైపు చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ EOW వింగ్‌లో సీపీ అవినాష్‌ కేసులు నమోదు చేశారు.
1.నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసు నమోదు చేశారు.
2. చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్‌, బాచుపల్లి MRO పూల్‌ సింగ్‌పై కేసు
3. మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై కేసు
4. HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్‌లపై కేసు నమోదు
5. HMDA సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు
6. హైడ్రా సిఫార్సు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. FTLలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు.
Viral Video: 14నెలల కిందట కిడ్నాప్.. కిడ్నాపర్ ను వదిలిరానంటూ బాలుడి ఏడుపు