Site icon NTV Telugu

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు.. రూ. 12 వేల కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం..

Drugs

Drugs

Hyderabad Drug: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు బట్టబయలు చేసేశారు. మేడ్చల్‌ కేంద్రం నడుస్తున్న డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలో సోదాలు చేసి, 12 వేల కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను హస్తగతం చేసుకున్నారు. అయితే, మేడ్చల్‌లోని ఎండీ డ్రగ్స్ కంపెనీపై దాడి చేసి, అక్కడ విస్తృత స్థాయిలో తయారవుతున్న మూడు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌టీసీ (XTC), మోలీ, MDMA లాంటి మాదకద్రవ్యాలు లభించాయి.

Read Also: Viral News: డ్యూటీ చేయకుండానే 16 ఏళ్లలో 11 కోట్లు జీతం తీసుకున్న టీచర్…

అలాగే, దాదాపు 32,000 లీటర్ల రా మెటీరియల్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ తయారీలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ తనిఖీలు చేసింది. కాగా, హైదరాబాద్‌లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

Exit mobile version