Site icon NTV Telugu

CP Sajjanar: వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్లో అలా చేస్తే కఠిన చర్యలే..

Sajjanor

Sajjanor

CP Sajjanar: హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడడం లేదా ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని, ఇది శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేశారు. ఇక, నగరంలో తిరిగే ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు ఈ నిబంధనలను తరచుగా ఉల్లంఘిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది.. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్‌లో లీనమైపోవడంతోనే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని సీవీ వీసీ సజ్జనార్ అన్నారు.

Read Also: Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

అయితే, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు ఇకపై కఠిన చర్యలు తీసుకుంటారు, భారీగా జరిమానాలు విధిస్తారని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. డ్రైవర్ భద్రతతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే వారి సేఫ్టీ చాలా ముఖ్యం అన్నారు. జీవితం కంటే పెద్దది ఏ సమస్య కాదు.. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ సజ్జనార్ కోరారు.

Exit mobile version