NTV Telugu Site icon

Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సం..

Samsabad

Samsabad

హైదరాబాద్ నగరంలో కార్లు సృష్టించే బీభత్సాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ కార్లను వాడడంతో ఇప్పుడు వాటి వాడకం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీటితో ప్రమాదాలు కూడా అదే రీతిలో జరుగుతున్నాయి.. నిన్న పాతబస్తిలో మైనర్ కుర్రాళ్లు కారును గోడకు ఢీ కొట్టి గాయాలపాలయ్యారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సాన్ని సృష్టించింది.. డి వైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టిన కారు. ఎయిర్ బెలూన్స్ ఒపెన్ కావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు గుర్తించారు..

ఈ ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం..బెంగుళూరు వెళుతున్న ప్యాసింజర్ ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది.. ఇందులో ఉన్న కస్టమర్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లడానికి బయలుదేరాడు.. మరి కొద్దిక్షణాల్లో గమ్యం చేరుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.. ఈ ప్రమాదం తో భయబ్రాంతులకు గురైన ప్యాసింజర్. వేరే కారులో ఎయిర్ పోర్ట్ కు తరలించారు..ఈ ఘటన పై సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయిందని తెలుస్తుంది.. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.