NTV Telugu Site icon

Breaking News: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..

Breking News

Breking News

Breaking News: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలను మినిస్టర్ క్వార్టర్స్ లోనికి అనుమతించక పోవడంతో తోపులాట చోటుచేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముందు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు బైఠాయించారు. జీవో నెంబర్‌ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక విద్యార్థులకు మెడికల్‌ సీట్లు కేటాయించాలని.. వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్నా చేపట్టారు. తెలంగాణలోని నాన్ లోకల్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వొద్దని ఆందోళనకు దిగారు. గణేష్ నిమజ్జనం జరుగుతుండగా బీఆర్‌ఎస్ విద్యార్థి నాయకుల ఆందోళనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Ganesh Immersion: గణేశ్ నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు..!

Show comments