Site icon NTV Telugu

Group-1 Candidates: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో విద్యార్థులు

Group 1 Students

Group 1 Students

Group-1 Candidates: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించడానికి వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు నిరసనకు దిగడంతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం ఆపాలని గ్రూప్-1 బాధితులు నినాదాలు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ శనివారం బాధితులతో కలిసి ఆందోళన చేయడం సంచలనం సృష్టించింది. తాజాగా ఈరోజు విద్యార్థులు నిరసనకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రేపటి నుంచి పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
HYDRA Tweet: కూల్చివేతలపై తప్పుడు వార్తలు.. హైడ్రా కీలక ప్రకటన

Exit mobile version