Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు

  • హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
  • బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు
  • తెలంగాణ రాష్ట్రానికి గర్వపడేలా చేసిందని ఆమె సన్నిహితులు
Gemini

Gemini

Hemalatha Reddy has been crowned Glammonn Mrs. India 2024: జెమినీ టీవీలో యాంకర్ గా పనిచేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో అంతర్జాతీయ షూట్ చేసారు. గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి మన్ దువా కూడా అక్కడ ఉత్సాహంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత హేమలత రెడ్డి మన్ దువా తో కలిసి బటుకేశవరా ఆలయాన్ని సందర్శించారు.

Also Read: Casting Couch: ఒక సినిమా కోసం ఐదుగురు నిర్మాతలు పడుకోమన్నారు.. హీరోయిన్ సంచలనం

ఇక ఆమె ఈ నెల 28న తిరిగి హైదరాబాద్ కి వస్తున్నారు. హేమలత రెడ్డి మలేషియాలో గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా టైటిల్ పొందారు. ఆమె మన దేశానికి మాత్రమే కాదు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి గర్వపడేలా చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఇది 1 సంవత్సరం సుదీర్ఘ ప్రయాణం కాగా బ్యూటీ గ్రూమర్‌లు ఆమెకు మంచి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నటి కావడంతో అన్ని ప్రయత్నాలు చేసి రెడీ అయ్యాక ఆమె గ్లామన్ మిసెస్ ఇండియా 2024 టైటిల్ విజేతగా నిలిచింది. దానితో పాటు ఆమెకు ఉత్తమ ఫోటోజెనిక్ & బెస్ట్ టాలెంట్ అనే ట్యాగ్స్ కూడా వచ్చాయి.