NTV Telugu Site icon

Telangana Rains: రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు..!

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా వానలకు కాస్త బ్రేక్ వచ్చిందనుకునే లోపే మళ్లీ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ శుక్రవారం అర్ధరాత్రి వర్షం పడింది. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవాళ (21)న కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు (22)న ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి (23)న ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Railway Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్..