Hyderabad Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ తడిసిముద్దయింది. కొత్తపేట, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Read also: K. Laxman: ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు.. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే..
రోడ్లపై భారీ వర్షం నీరు నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ముందస్తు ఏర్పాట్లు చేశారు. వీకెండ్ కావడంతో జనం పెద్దఎత్తున బయటకు వచ్చే అవకాశం ఉందని… అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని సూచిస్తున్నారు. మరోవైపు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదోని, అనంతపురం, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం కంటే సాయంత్రం వేళల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది.
Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?