Ande Sri Death: గాంధీ ఆసుపత్రి మెడికల్ జనరల్ హెచ్ఓడీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 7:20 కి గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు అందెశ్రీని తీసుకొచ్చారు. ఇక, ఉదయం 7.25 గంటలకి చనిపోయినట్లు గాంధీ హాస్పిటల్ బ్రాండెడ్ గా డిక్లేర్ చేశారు. హార్ట్ స్ట్రోక్ తో అందెశ్రీ చనిపోయారు అని తెలిపారు. అందెశ్రీ గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉంది.. ఒక నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదు.. ఆయాసం ఉంది చెస్ట్ డిస్ కంఫర్టబుల్ తో ఉన్నారు.. ఆరోగ్య విషయంలో అందెశ్రీ నెగ్లెట్ చేశాడు.. రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారు.. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసే సరికి బాత్ రూమ్ దగ్గర కింద పడిపోయి ఉన్నారు.. రాత్రి ఏం జరిగిందో తెలియదు అని వైద్యులు సునీర్ కుమార్ చెప్పారు.
Read Also: Odisha: జాజ్‌పూర్‌లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు
ఇక, ఉదయం 6:20 ప్రాంతంలో కుటుంబ సభ్యులు అందెశ్రీ ని గమనించి.. ఆస్పత్రికి తీసుకుని రాగా గాంధీ ఆర్ఎంఓ డాక్టర్ సింధూర అందెశ్రీ చనిపోయారని డిక్లేర్ చేసిందని గాంధీ ఆసుపత్రి మెడికల్ జనరల్ హెచ్ఓడీ సునీల్ కుమార్ వెల్లడించారు. అందెశ్రీ చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చు.. మూడు రోజులుగా అనారోగ్యంగా అందెశ్రీ ఉన్నప్పటికి వైద్యులని సంప్రదించలేడు.. నెల రోజుల నుంచి ఆయన బీపీ మాత్రలు వేసుకోలేదన్నారు.
