NTV Telugu Site icon

Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ.. ముఖ్యాంశాలు ఇవే..

Harish Rao

Harish Rao

Harish Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేఖలోని ముఖ్యాంశాలు ఇవే..

* కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనం.

* రేవంత్ రెడ్డి మాజీ సీఎం కే.సి.ఆర్ పై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడు తనానికి నిదర్శనం.

* రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చింది.

* అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా?

Read also: Tension in Narayanapet: నారాయణపేటలో ఉద్రిక్తత.. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరిక..

* ఢిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ కే చెల్లుతుంది.

* రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం.. కాంగ్రెస్ హై కామెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

* రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది.

* కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయం.

* కే.సి.ఆర్  పై, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా?

* కే.సి.ఆర్ ను రాళ్లతో కొట్టి చంపాలి” అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా?

Read also: Hyderabad Metro: మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. యాజమాన్యం కీలక సూచన..

* హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

* రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు.

* పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గం.

* రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది అని చెప్పేందుకు ఇది నిదర్శనం.

* కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే.

* రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.
Hyderabad Crime: యు నాటీ.. ఆడవేషంలో గజ దొంగ.. టార్గెట్ చేస్తే వదలడు..

Show comments