Group-2 Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. గ్రూప్-2 మొదటి రోజు మొదటి పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని టీజీపీఎస్పీ సూచించింది. ఉదయం 9:30 గంటల తర్వాత గేట్లు మూసేస్తామని కూడా చెప్పారు. దీంతో అభ్యర్థులు సమయానికి కేంద్రానికి చేరుకున్నారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు. మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనుంది. నాలుగు పేపర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రభుత్వం 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసినా వివిధ కారణాలతో పరీక్ష నాలుగుసార్లు వాయిదా పడింది. ఈ పరీక్షకు 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. లక్ష మందికి పైగా అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేదని తెలుస్తోంది.
Atul Subhash Case: టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. అతుల్ భార్య, అత్త అరెస్ట్
Group-2 Exams: ప్రారంభమైన గ్రూప్-2 తొలి రోజు తొలి పరీక్ష..
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షలు..
- సమయానికి కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులు.
- సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు..
Show comments