NTV Telugu Site icon

TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్‌-2 పరీక్షలు.. ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణ..

Tgpsc Group 2 Exam

Tgpsc Group 2 Exam

TGPSC Group 2 Exam: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి 29 డిసెంబర్ 2022న TGPSC ప్రకటన విడుదల చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసినా పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Read also: Allu Arjun@7697: అల్లు అర్జున్కు ఖైదీ నెంబర్ 7697..

పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలని చెప్పారు. అభ్యర్థులు మంగళసూత్రం, కంకణాలు ధరించవచ్చని, చెప్పులు ధరించి రావాలని సూచించారు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్‌లను సమర్పించాలని పేర్కొంది.
Hostels Checking: నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో తనిఖీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే..

Show comments