Site icon NTV Telugu

Group 2 Exam: నేడు, రేపు గ్రూప్ -2 పరీక్షలు.. అరగంట ముందే గేట్లు క్లోజ్!

Group 2

Group 2

TGPSC Group 2 Exam: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి 29 డిసెంబర్ 2022న TGPSC ప్రకటన విడుదల చేయగా.. 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలని తెలిపారు. అభ్యర్థులు మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, బూట్లు వేసుకుని రాకూడదని, చెప్పులు ధరించాలని సూచించారు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాలని లేదంటే ఓఎంఆర్ మూల్యాంకనం చేయబోమని తెలిపింది.
Hostels Checking: నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో తనిఖీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే..

Exit mobile version