NTV Telugu Site icon

GHMC Commissioner: నగరంలో రెడ్ అలెర్ట్.. ప్రజలకు ఆమ్రపాలి సూచన..

Amrapali

Amrapali

GHMC Commissioner: నగరంలో రెడ్ అలెర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

హైడ్రా జిహెచ్ఎంసి సమన్వయంతో పని చేసి ఎవ్వరికీ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. నగరంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గేవరకు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. రోడ్లపై ఏర్పడ్డ గుంటలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా జిహెచ్ఎంసి సిబ్బంది పనిచేస్తుందన్నారు. ప్రజలకు అత్యవసరమైతే 040 21111111, 9000113667 నెంబర్ ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.