NTV Telugu Site icon

Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..

Gachibowli Fly Over

Gachibowli Fly Over

Gachibowli Fly Over: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఆర్‌డిపి పనుల్లో భాగంగా గత కొంతకాలంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా అక్టోబర్ 28 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. అయితే.. మిగిలిన సమయంలో వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. అయితే రాత్రి 11 గంటల తర్వాత ప్రయాణించే వారు ఈ వారం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు.
Rifle Bullets In Train: వందలాది రైఫిల్ బుల్లెట్లతో రైలులో ప్రయాణించిన అమ్మాయి

Show comments