NTV Telugu Site icon

Shamshabad Airport: వాట్ ఏ ఐడియా సార్ జీ.. బూట్ లో కోటి విలువైన విదేశీ బంగారం..

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad Airport: ఎన్ని నిఘాలు పెట్టినా అధికారుల కళ్లుగప్పి స్మగ్లర్లు స్మార్ట్ గా దొంగతానాలు చేసుకుంటు పోతున్నారు. ఇటీవల ఏ విమానాశ్రయాల్లో చూసిన కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడి వద్ద ఒక కోటి ఆరువేల రూపాలయ విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి విదేశీ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికున్ని DRI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్‌కు బయలు దేరాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే కస్టమ్స్ ఆఫీసర్లను చూసి బిత్తరపోయాడు. అయినా ఏమీ తెలియనట్లు ఎయిర్ పోర్టులోనే అటు ఇటు తిరగసాగాడు. దీంతో అతనిపై అధికారులకు అనుమానం వచ్చింది. అంతర్జాతీయ నిష్క్రమణ వద్ద అనుమానిత ప్రయాణీకుడి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దకు వెళ్లి తన లగేజ్ ను తనిఖీ చేయగా బిత్తర పోయారు. తన బూల్ లో కూడా బంగారం వుందని చెప్పడంతో షాక్ కు గురయ్యారు.

Read also: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..

అతని వద్ద నుండి విదేశీ బంగారం పట్టుకున్నారు. ప్రయాణికుడు దాచిపెట్టిన బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పెద్ద మెటల్ బార్, ఎడమ షూ అతని బ్యాక్ ప్యాక్‌లో పసుపు రంగు లోహపు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ ఒక కోటి ఆరు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. బంగారం బరువు 1390.850 గ్రాములు ఉంటుందని దానిని సీజ్ చేసినట్లు DRI అధికారులు తెలిపారు. ప్రయాణికుని బూట్లు & అతని బ్యాక్‌ప్యాక్‌ను స్కానింగ్ చేయగా బయటపడ్డ విదేశీ బంగారం పట్టుబడిందని అధికారులు వెల్లడించారు. కేసునమోదు చేసుకుని అతనిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంతకు ముందుకూడా బంగారం సరఫరా చేశాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వార్త తెలిసిన వారంతా ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు అంటూ కమెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే వాట్ ఏ ఐడియా సార్ జీ.. తుసి గ్రేట్ హో అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు.
Cough Medicine: దగ్గు మందులతో సైడ్ ఎఫెక్ట్స్..? షాకింగ్ నిజాలు..!

Show comments