Site icon NTV Telugu

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన!

Hyd

Hyd

Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం నుంచి విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు, క్రూ ఆలస్యాలు, ఇతర నిర్వాహక సమస్యల కారణంగా అనేక ఫ్లైట్‌లు సమయానికి రాకపోకలు కొనసాగించడం లేదు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏటీసీ సమస్యతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులపై దీని ప్రభావం పడింది.

Read Also: JK Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

రద్దైన విమానాలు
* ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలు విమానాలు పూర్తిగా రద్దు..
* ఇండిగో 6E051 హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం రద్దు..
* ఇండిగో 6E245 హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు..
* ఇండిగో 6E51 హైదరాబాద్ నుండి శివమొగ్గ వెళ్లాల్సిన విమానం కూడా రద్దు..

సాంకేతిక లోపాలతో ఆలస్యం
కొన్ని విమానాలు సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమవుతున్నాయి. ఎయిర్ ఏషియా 68 – హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పాటు వియత్నాం ఎయిర్‌లైన్స్ వన్984 – సాంకేతిక లోపంతో ఆలస్యమవుతోంది. అలాగే, ఇండిగో 6E37 – శివమొగ్గ వెళ్లాల్సిన ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.

ప్రయాణికుల ఆగ్రహం..
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో 6I532 విమానం, క్రూ సభ్యులు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు చాలా సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిర్‌లైన్‌ అధికారులను ప్రశ్నిస్తూ కొందరు గొడవకు దిగారు. తమ విలువైన సమయం పూర్తిగా నష్టపోయామని పేర్కొన్నారు. విమానాలు ఆలస్యమైనా, రద్దయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

 

Exit mobile version