NTV Telugu Site icon

Maheshwar Reddy: కొడంగల్ పనులు మేఘా కృష్ణతో ఒప్పందం.. అందుకే సుంకి శాలపై స్పందన లేదు..

Maheshwar Reddy

Maheshwar Reddy

Maheshwar Reddy: కొడంగల్ పనులు కూడా మేఘ కి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని మాకు సమాచారం ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకి శాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పై కేంద్రం ఇన్వాల్వ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వమని చెప్పండి సీబీఐతో ఎంక్వైరీ చేయించే బాధ్యత మాదని అన్నారు. సుంకి శాల కూలి పది రోజులు అయిన ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. అనంతరం మేఘా కృష్ణ రెడ్డి పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారిన పెత్తనం మాత్రం మేఘ కృష్ణ రెడ్డి దే అన్నారు. గవర్నమెంట్ మారిన కాంట్రాక్టర్ మారాడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులు చేసిన ఆయనకే కాంటాక్ట్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న టెండర్ ను ఎస్కలెట్ చేయడం మేఘ పాత్ర ఉందన్నారు. సుంకి శాల కూలి పది రోజులు అయిన ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు.

Read also: Malla Reddy University: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

మేఘను కాపాడుకునేందుకు విషయాన్ని దాచారా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులు చేసిన గుత్తేదార్లను నాయకులు కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అన్నారు. గతంలో సుంకిశాల అంచనా వ్యయం 8 వందల కోట్ల అంచన వ్యయం మేఘ పెంచుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక 4 వేల కోట్ల అంచనా వ్యయం మరోసారి పెంచారని తెలిపారు. క్రిమినల్ కాంట్రాక్టర్ల కు వేల కోట్లు దోచి పెడుతున్నారని అన్నారు. నాయకులు అంత కలిసి మేఘ కృష్ణా రెడ్డికి దోచిపెడుతున్నారని తెలిపారు. మేఘ మీద చర్యలు ఎందుకు లేవు ? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా మేఘ మీద పీసీసీ రేవంత్ ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐ కి సిఫార్సు చేయడం లేదన్నారు. దాని మీద రిటైర్డు జడ్జి కమిటీ వేశారన్నారు. జడ్జి కి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఆయనకి కీలకమైన ఫైల్స్ ఇవ్వడం లేదంట అన్నారు.

Read also: Bhatti Vikramarka: వారానికి ఒకసారి నివేదిక పంపండి.. చీఫ్ ఇంజనీర్లకు భట్టి విక్రమార్క ఆదేశం..

కమిటీ నీ ప్రభుత్వమే నీరు గార్చే పని లో ఉన్నారన్నారు. ప్రభుత్వం తన జేబులో ఉందని మేఘ దర్జాగా ఉన్నారని తెలిపారు. అధికారంలో ఎవరు ఉన్న నేను ఇచ్చే కమీషన్లకు లోగాల్సిందే అని మేఘ కృష్ణ రెడ్డి ధీమాగా ఉన్నారని అన్నారు. ఆరోపణలు ఉన్న.. అవినీతి విచారణ ఎదుర్కొంటున్న కంపెనీ కి కాంటాక్ట్స్ ఇస్తున్నారని చెప్పారు. దీని వెనకున్న మతలబు ఎంటి? అని ప్రశ్నించారు. కొడంగల్ పనులు కూడా మేఘ కి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని మాకు సమాచారం ఉందన్నారు. మేఘ కృష్ణ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేఘ కంపెనీ నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. మేఘ మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ కి సిఫార్సు చేయాలన్నారు. అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవి.. జరిగిన ప్రమాదం పై విచారణ జరపాలన్నారు. కేసిఆర్ అవినీతి సొమ్మును కాంగ్రెస్ పెద్దలు పంపకం చేసుకునే ఒప్పందం జరిగింది అనే అనుమానం ఉందన్నారు.. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఉన్నారని తెలిపారు. సెటిల్మెంట్ కాక కొట్లాడుతున్నారా? లేదంటే ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? అని మండిపడ్డారు.

Read also: Manda Krishna Madiga: తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు లేదు..

అందుకే ఆ రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ తప్పిదం అని కాంగ్రెస్ చెప్తుందన్నారు. నిజంగా ఆ ప్రభుత్వ తప్పిదం అయితే దాన్ని ఈ అవినీతి పై సీబీఐ కి సిఫార్సు చేయాలన్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మేఘ కృష్ణ రెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. మేఘ ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. స్వయంగా మీ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మేఘ దొంగ గ్యారెంటీ లు పెట్టిందని ఆరోపణలు చేశారన్నారు. లేని బ్యాంక్ గ్యారెంటీ పెట్టిన మేఘ మీద చర్యలు ఎందుకు లేవు.. మేఘ క్రిమినల్ అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఏమీ కావాలి ?.. నేను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను.. నాసిరకం పనులు చేసినందుకు 27-07 2024 న మేఘ కి కేంద్రం నోటీసులు ఇచ్చింది నిజం కదా?.. మేఘ ఒక ఫేక్ కంపెనీ అన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కంపెనీకి కృష్ణ రెడ్డి అధిపతి అన్నారు. పనులు పూర్తి చేయకుండా నాయకులను మభ్య పెట్టీ ఎస్కలేట్ చేసుకుంటున్న మేఘ అని తెలిపారు. మేఘ అవినీతిపై సోమవారం మరొక్కసారి ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతా అన్నారు. ఆధారాలు ఎక్కడ సబ్మిట్ చేయమంటే అక్కడ సబ్మిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న గజదొంగ సంస్థ మేఘ అని తెలిపారు. మేఘ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మేము ఆందోళన చేస్తామన్నారు.
Bandi Sanjay: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..