Dussehra Holidays 2024: నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు మొదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా సెలవు రోజుల్లో ఎవరైనా ప్రైవేట్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఏడాది దసరా సెలవులు 13 రోజులు అంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో అప్పటి నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి సెలవులు ఇవ్వగా.. అక్టోబరు 15న పునఃప్రారంభం కానున్నాయి. ఇక.. దసరా సెలవుల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న వారంతా.. గ్రామాలకు వెళ్లి పండగను ఎంజాయ్ చేయనున్నారు. అయితే రాష్ట్రంలో దసరా సెలవుల అనంతరం మళ్లీ విద్యాసంస్థలకు డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక జూనియర్ కాలేజి లకు ఈ నెల 6 నుండి 13 వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపారు.
Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
Dussehra Holidays 2024: నేటి నుంచే దసరా సెలవులు.. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు..
- నేటి నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవలు..
- ఈనెల 15వ తేదీని నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం..
- డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ..
Show comments