Director KS Ravikumar About Linga Movie.
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావంతో ఉంటారయన. అయితే దక్షిణాదిన దర్శకుడు కేఎస్ రవికుమార్ గురించి తెలియవారు కూడా ఉండరు. ఎందుకంటే ఆయన సినిమాలు అంత క్రేజీగా ఉంటాయిమరీ. వీరిద్దరి కాంబోలు ముత్తు, నరసింహా సినిమాలు ఏ రేంజ్‌లో హిట్ అయ్యయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరి కాంబో నుంచి మరో హిట్ కోసం వచ్చిన సినిమా లింగ. అయితే ఈ సినిమాన ఊహించని రీతిలో డిజాస్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ సినీ చరిత్రలో లింగకు ప్రత్యేక స్థానం ఉన్నా.. అది ఆశించిన ఫలితాన్ని అందించకలేకపోయింది. అయితే తాజాగా దర్శకుడు కేఎస్ రవికుమార్ ఓ ఇంట్వర్యూలో మాట్లాడుతూ.. లింగ సినిమా డిజాస్టర్ వెనుక కారణాలను చెప్పకొచ్చారు.
లింగ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్న సమయంలో రజనీ రషెస్ చూశారని, అయితే అందులో తాను ఆశించిన అంశాలు లేవని ఆయన అసంతృప్తికి గురయ్యారని వెల్లడించారు రవికుమార్. దాంతో ఆయన పలు సూచనలు చేశారన్నారు. అంతేకాకుండా.. క్లైమాక్స్ లో వచ్చిన బెలూన్ ఫైట్ ను తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని, చివర్లో హడావుడిగా పెట్టాల్సి వచ్చిందని వివరించారు రవికుమార్. అంతేకాకుండా.. వేగంగా షూటింగ్ పూర్తిచేసి రజనీకాంత్ పుట్టినరోజు నాడు సినిమా రిలీజ్ చేశామని, దీంతో అవుట్ పుట్ సరిగా రాక సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచిందని పేర్కొన్నారు కేఎస్ రవికుమార్.