NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలి..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలు పరిష్కరించాలని భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని అన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందన్న సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని వివరించారు.

Read also: CM Revanth Reddy: కలెక్టర్లు ఎసీ గదులకే కాదు.. క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే..

మరోవైపు సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామన్నారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని అన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే అని తెలిపారు. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారన్నారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సీఎం తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని తెలిపారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలన్నీరు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్నారు.
Post Office GDS Jobs 2024: పరిక్ష లేకుండా పదో తరగతి అర్హతతో పోస్టల్‌‭లో ఉద్యోగాలు..