NTV Telugu Site icon

Bhatti Vikramarka: మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికే కాదు కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Bhatti Vikramarka: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మన దేశం ప్రపంచంతో పోటీ పడేలా మన్మోహన్‌ సింగ్‌ కృషి చేశారన్నారు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నిలబెట్టారన్నారు. మన్మోహన్‌ మరణం దేశానికి తీరని లోటని భట్టి తెలిపారు.

Read also: KTR Quash Petition: ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

ఆయన మృతి దేశానికే కాదు కాంగ్రెస్‌ పార్టీకి కూడా తీరని లోటు, నష్టం అన్నారు. అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవన్నారు భట్టి. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డగా కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని అన్నారు. వా