NTV Telugu Site icon

Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్‌..

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజ నరసింహ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్షించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అదికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని సూచించారు. తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఫైర్ అలార్మ్స్‌, స్మోక్ట్ డిటెక్టర్స్‌ ఉన్నదీ, లేనిది పరిశీలించాలన్నారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో? లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని సూచించారు.ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. హాస్పిటళ్లలో పవర్ సప్లై సిస్టమ్‌ను పరిశీలించాలని, పాత ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌ ఉంటే, వాటి స్థానంలో, నాణ్యమైన కొత్త కేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్‌ సర్క్యూట్‌కు సంబంధించి చేయవలసినవి, చేయకూడని సైన్ బోర్డు (Do’s, Don’ts sign boards)ను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్‌కు సమీపంలోని ఫైర్ స్టేషన్‌ సిబ్బందితో హాస్పిటల్ అధికారులు టచ్‌లో ఉండాలని, హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని ఆదేశించారు.ప్రతి హాస్పిటల్‌కు fire evacuation plan రూపొందించాలని అన్నారు. ఆ ప్లాన్‌పై డాక్టర్లు, స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. fire evacuation ప్లాన్‌కు సంబంధించిన సైన్ బోర్డులను హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయాలన్నారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..