NTV Telugu Site icon

Cyber ​​Fraud: ఆ లింక్‌ క్లిక్ చేయకండి.. రాష్ట్ర ప్రజలకు సైబర్‌ సెక్యూరిటీ సూచన..

Cybersecurity

Cybersecurity

Cyber ​​Fraud: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే దీనిని ఆధారంగా చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సూచించింది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎవరైనా సైబర్ నేరగాళ్లు OTP లు అడిగే తెలపకూడదని తెలిపింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి వారి నుంచి జాగ్రత్త ఉండాలని తెలిపింది. సమగ్ర సర్వే పేరుతో ఎటువంటి లింకులు వచ్చిన వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు. సమగ్ర విచారణ ఇంటింటికి నియమించిన అధికారులే వస్తారని పేర్కొంది. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్‌వైజర్లను నియమించిందని గుర్తు చేశారు. ఎటువంటి అనుమానం వచ్చినా సైబర్‌ క్రైమ్‌ నెంబర్‌ 1930కు డయిల్‌ చేయాలని కోరారు.

Read also: CM Revanth Reddy: నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.

ఇటీవల సైబర్‌ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు..రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్​ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బుల కోసం నిరుద్యోగులను, అమాయక ప్రజలను తమ వలలో పడేంత వరకు మాటలు మాట్లాడి నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆతరువాత డబ్బులను దోచుకునే పనిలో పడతారు. అంతేకాదు.. తాజాగా సైబర్ కేటుగాళ్లు రాజకీయ, పోలీసుల వాట్సప్ డీపీ ఫోటోలు పెట్టి కూడా ప్రజలను భయపెట్టి డబ్బులను గుంజుకున్న దాఖలాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమగ్ర సర్వే పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ లు పంపినా నమ్మవద్దని తెలిపారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దని ముందగానే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు.
IT Raids on Grandhi Srinivas: మూడో రోజు గ్రంధి శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ సోదాలు

Show comments