NTV Telugu Site icon

Patancheru Congress: గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలోకి వద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy

Patancheru Congress: పటాన్ చెరులో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ చేస్తున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారంతో కాంగ్రెస్ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో వస్తే పార్టీ వర్గాలుగా చిలిపోతుంద మండిపడ్డారు. నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధులు కలిసి మంత్రి దామోదర, సీఎం రేవంత్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

Read also: Ponguleti Srinivas Reddy: గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే..

ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్, ఈడీ కేసులు ఉండటంతో పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తయంటున్న కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు తన అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో తన చేరికపై మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లతో మహిపాల్ రెడ్డి చర్చలు సాగుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.

Read also: Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా.. బీజేపీ, బీఆర్ఎస్ లపై పొన్నం ఫైర్

హ్యాట్రిక్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి తాజాగా సీఎం రేవంత్ ను కలవడంతో ఆయన కూడా పార్టీలోకి జంప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి మరో ఐదు మంది ఉప్పల్, ఎల్బీనగర్, ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్ కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ త్వరలో ఖాళీ కానున్నట్లు తెలుస్తోంది.
Kejriwal Health Condition: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై తీహార్ జైలు అధికారులు క్లారిటీ..?