NTV Telugu Site icon

Jagga Reddy: రివైంజ్ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jagga Reddy

Jagga Reddy

తెలంగాణ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివైంజ్ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకం అని చెప్పారు. అయినా రివైంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదని సూచించారు. అలాంటి రాజకీయాలు చేసే వాళ్లు అధికారం పోయాక బాధ పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య.. రివైంజ్ పాలిటిక్స్ చేయలేదన్నారు.

ఎవరైనా తనకు నష్టం చేసినా.. తానెవ్వరికీ నష్టం చేయను అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాకపోతే రాజకీయ యుద్ధం మాత్రం చేస్తామని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా… డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఎవరైనా ఒప్పుకుంటారా..?, తనతో సహా పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడెవరూ ఉండరని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.