NTV Telugu Site icon

Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ – చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం కారణం అధికారులు నిలిపివేశారు. అయితే ఉదయం 7:15 ని చెన్నై వెళ్ళాల్సిన విమానం మధ్నాహం అయినా కూడా వెళ్ళకపోవడంతో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ఉదయం బోడింగ్ తీసుకున్న అనంతరం విమానంలో అరగంట ప్రయాణికులు కూర్చున్నారు. తర్వాత సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు తెలిపారు. అరగంట తరువాత లోపం అంటే ఎలా? ముందే చూసుకోవాలి కదా అంటూ ప్రయాణికులు విరుచుకుపడ్డారు. విమానం నుంచి దిగమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. విమాన యాజమాన్యాల తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇది సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లు

విమానం సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. విమానం దిగే ప్రశక్తే లేదని అన్నారు. దీంతో ఎయిర్‌ పోర్టు సెక్యూరిటీ రంగంలోకి దిగారు. యాణికులను విమానంలో నుండి బలవంతంగా టర్మినల్ వద్దకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయండ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7.15కు బయలు దేరాల్సిన విమానం మధ్యాహ్నం 12.30 అవుతున్నా సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం ఏంటిన ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు అనేకమంది అనారోగ్యంతో, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు, బీపీ షుగర్, ఉన్నవాళ్లు ఉన్నారని, ఇబ్బంది గురవుతున్నట్లు తెలిపారు. ఉదయం నుండి ఎయిర్ పోర్ట్ లో బడిగాపులు కాస్తున్న ఎయిర్లైన్స్ అధికారులు ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లు