NTV Telugu Site icon

Telangana Weather: ఉమ్మడి జిల్లాలో మళ్ళీ పెరిగిన చలి తీవ్రత.. సింగిల్ డిజిట్‌కు కనిష్ట ఉష్ణోగ్రతలు

Adilabad Cool Wether

Adilabad Cool Wether

Telangana Weather: తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే నమోదయ్యాయి. అయితే గత 2 రోజులుగా మళ్లీ చలి పెరిగే అవకాశాం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాపై చలి పులి పంజా విసురుతుంది. ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత మళ్ళీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా, కొమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతతో స్థానికులు చలి మంటలు పెట్టుకుంటున్నారు.

జిల్లాల వ్యాప్తంగా చలి తీవ్రత..

* మెదక్ జిల్లా శివంపేటలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

* సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 9.7, కంగ్టి 9.8, కోహిర్ 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

* సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

* ఆదిలాబాద్ జిల్లా బేల లో 7 డిగ్రీలు*గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.

* కొమురం భీం జిల్లా సిర్పూర్ టి లో 7.3గా నమోదు.

* నిర్మల్ జిల్లా పెంబి లో 8.3

* మంచిర్యాల జిల్లా తపాలా పూర్ లో 10.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
Astrology: డిసెంబర్ 12, గురువారం దినఫలాలు

Show comments