CM Revanth Reddy: ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజాభవన్ లో తెలంగాణ నుంచి UPSC సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు. సింగరేణి కంపెనీ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు HICCలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గోపన్‌పల్లి తండా వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ధరణిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Read also: AP Latest Weather Report: ఏపీలో వర్షాలపై తాజా రిపోర్ట్.. ఈ జిల్లాలకు వార్నింగ్..
సివిల్స్ లో మొత్తం 1016 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వారిలో తెలంగాణ తెలంగాణ నుంచి UPSC సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులతో సీఎం ముఖాముఖి కార్యక్రం ఉంటుంది.
Read also: Daggubati Rana: ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ కు గాను..
మరోవైపు ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ శివారు సేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్‌పల్లితండా ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో గోపన్‌పల్లితండా ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌తో పాటు గోపన్‌పల్లి, తేలాపూర్, నల్గండ్ల గేటెడ్ కమ్యూనిటీల మధ్య వంతెనగా ఉన్న ఈ వంతెనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో స్థానికులకు, ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.
సుమారు రూ.28.5 కోట్లతో: గత ప్రభుత్వ హయాంలో ఈ వంతెన నిర్మాణాన్ని రోడ్లు భవనాల శాఖ, పీవీరావు నిర్మాణ సంస్థ సుమారు రూ.28.5 కోట్లతో చేపట్టాయి. ఈ వంతెన ఒక వైపు మాత్రమే వెళ్లేలా ‘Y’ ఆకారంలో నిర్మించబడింది. గోపన్‌పల్లి నుంచి వట్టినాగులపల్లి ఓఆర్‌ఆర్‌కు వెళ్లే రేడియల్ రోడ్డులో తాండా జంక్షన్‌లో ఈ వంతెనను నిర్మించారు. గౌలిదొడ్డి వైపు నుంచి నల్గండ్ల వైపు వరకు 430 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో పాటు తేలాపూర్ వైపు 550 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మించారు. 84.4 మీటర్ల సింగిల్ స్పాన్‌తో వంతెనను నిర్మించేందుకు 243 మెట్రిక్ టన్నుల స్టీల్, 806 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు.
Read also: Fire Accident : గోవా సమీపంలో గుజరాత్ నుంచి శ్రీలంక వెళ్తున్న కార్గో షిప్ లో భారీ అగ్ని ప్రమాదం
ఇక మరోవైపు భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధరణి వెబ్‌సైట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఇవాళ మళ్లీ అధికారులతో ధరణిపై సమావేశం నిర్వహించనున్నారు.
Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు