CM Revanth Reddy: నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎంఎస్‌ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం MSME పాలసీని ప్రకటించబోతోంది.
Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం..
CM Revanth Reddy: నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనున్న సీఎం..
- నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది..
- ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదికలో విడుదల చేయనున్న సీఎం..
Show comments