NTV Telugu Site icon

CM Revanth Reddy: పరీక్షలు పెట్టకుండా… వాయిదా వేస్తూపోతే వయసైపోతుంది..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: పరీక్షలు పెట్టకుండా.. వాయిదాలు వేసుకుంటూ పోతే యుక్త వయసు అంతా వృథా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టనున్నాం. నిరుద్యోగులు సమస్య పరిష్కారం చేయడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఎక్కడైతే ప్రమాణం చేశామో.. నిరుద్యోగులకు కూడా అక్కడే ఉద్యోగ ప్రమాణం చేయించామన్నారు. పదేళ్లలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వం ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదన్నారు. విద్యార్దులు మాత్రం సంవత్సరాల కొద్ది.. కోచింగ్ సెంటర్ లో చుట్టూ తిరిగారని తెలిపారు. విద్యార్థుల బాధ మేము కళ్లారా చూసినామని అన్నారు. అందుకే మేము వచ్చిన వెంటనే.. టీఎస్పీఎస్సీ రద్దు చేసి కొత్త కమిషన్ వేశామని అన్నారు. గ్రూప్ రాసే విద్యార్థుల ఆలోచనకి అనుగుణంగా పరీక్షలు నిర్వహించామన్నారు.

Read also: Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..

గ్రూప్ 2.. గ్రూప్ 3 కి సమానమైన సిలబస్ ఉంటుంది కాబట్టి.. కొద్ది తేడాతో పరీక్షలు నిర్వహించుకుంటున్నామన్నారు. యూపీఎస్సీ మీద నమ్మకం ఉంటుంది విద్యార్థులకు.. కాబట్టి పరీక్ష మీద దృష్టి పెడతారన్నారు. కానీ టీఎస్పీఎస్సీ మీద గత పదేళ్ళలో అపనమ్మకం ఉండేదన్నారు. ప్రభుత్వం మీద.. టీఎస్పీఎస్సీ మీద ఉద్యమాలు చేశారన్నారు. అందుకే నమ్మకం గా ఉద్యోగాలు నిర్వహించి భర్తీ చేయాలని చెప్పినం అన్నారు. పరీక్షలు రాసి ఉద్యోగం రాకుంటే.. ప్రైవేట్ సెక్టార్ లోకి ఐనా వెళ్తారన్నారు. కానీ పరీక్షలు పెట్టకుండా… వాయిదాలు వేసుకుంటూ పోతే యుక్త వయసు అంతా వృథా అవుతుందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నామన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామన్నారు. జూన్ 2 లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు తెలిపారు.
Secunderabad Bonalu: రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు..