NTV Telugu Site icon

CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్‌

Mutyalamatemple Cm Revanth Reddy

Mutyalamatemple Cm Revanth Reddy

CM Revanth Reddy: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. కొంతమంది హైదరాబాదులో శాంతి లేకుండా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలి, ఎంతో భావాద్వేగంతో పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు. మతోన్మాద శక్తులను ఈ తరహా నేరగాళ్లను శిక్షించాలని అధికారులను ఆదేశిస్తున్నా అన్నారు. వివిధ మతాల పండుగలకు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు. పోలీసులు ఎవరు ఎదుట చేయి చాపకూడదన్నారు. హుందాగా గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్ శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయన్నారు.

Read also: CM Revanth Reddy: అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది..

క్రిమినల్స్ తో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉండడం కాదు.. బాధితులతో ఫ్రెండ్లీ గా ఉండాలని సూచించారు. క్రిమినల్స్ విషయం లో పోలీసులు కఠినంగా వ్యవహారించాలని తెలిపారు. పోలీస్ కుటుంబాలు కోసం యంగ్ ఇండియా స్కూల్ ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈరోజు పునాది వేస్తున్నాం అన్నారు. వచ్చే అకాడమీ నుండి విద్యా సంస్థ ప్రారంబిస్తామన్నారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తానని తెలిపారు. వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇక నుండి కోటి రూపాయలు నష్ట పరిహారం అన్నారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తం అన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాక్ అధికారులను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు.
KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..