NTV Telugu Site icon

Nalla Pochamma Bonalu: ప్రజాభవన్‌ లో బోనాల సందడి.. నల్ల పోచమ్మ ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి

Prjabhavan Bonalu

Prjabhavan Bonalu

Nalla Pochamma Bonalu: ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఘనంగా నిర్వహిసున్నారు. అయితే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుండి.. అబ్దుల్లాపూర్ మెట్ కు సీఎం రేవంత్ బయలుదేరారు. కాటమయ్య రక్ష పథకానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం శ్రీకారం చుట్టనున్నారు.

Read also: Mehandipur Balaji: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వణుకు పుట్టాల్సిందే.. మీకు ధైర్యం ఉందా..?

బోనం అంటే ఆషాడం.. శతాబ్దాల తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఆషాఢ మాసానికి అవినాభావ సంబంధం ఉంది. ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఒక ఎత్తయితే, ఆషాడమాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తు. ఆటపాటలతో, శివసత్తుల పూనకాలతో, పోతరాజుల నృత్యాలతో ఒరువాడ మార్మోగింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బోనం ఖండాంతరాలు దాటి ప్రపంచమంతా శోభాయమానంగా ప్రకాశిస్తుంది. జూలై 7వ తేదీ ఆదివారం నాడు గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Read also: Sangareddy: అంగట్లో సరుకుల్లా నర్స్ పోస్టులు.. అమ్మకానికి పెట్టిన కిలాడి లేడీలు..

అనంతరం సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల జాతరతో ముగుస్తుంది. ఈ నెల రోజుల పాటు నగరం సందడిగా ఉంటుంది. గల్లీలు, కాలనీలు, ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా అన్ని దారులూ అమ్మ వద్దకు చేరుకుంటాయి. అందరి కోరిక ఒక్కటే.. అందరి ప్రార్థన ఒక్కటే.. మా పిల్లల పాపను చూడు తల్లీ. కొత్త కుండలో కొత్త బియ్యంతో తయారు చేసిన ఎండు ద్రాక్ష, బెల్లం అమ్మవారికి నైవేద్యంగా సిద్ధం చేస్తారు. పసుపు, కుంకుమ, వేపపూలతో అలంకరించిన బోనంకుండలో ఉంచి డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. బోనాల ఉత్సవాల్లో పోతురాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Film News: ఒక్క క్లిక్ తో మూడు సినిమాలు..నొక్కి చూస్తే షాక్ అవుతారు..