NTV Telugu Site icon

CM Revanth Reddy: ఆయన పాట ప్ర‌జా యుద్ధ నౌక.. గ‌ద్ద‌ర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..

Gadda Revatnh Reddy

Gadda Revatnh Reddy

CM Revanth Reddy: పొడుస్తున్న పొద్దు మీద న‌డుస్తున్న కాల‌మా… పోరు తెలంగాణ‌మా అంటూ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి ఆయువుప‌ట్టుగా నిలిచిన వ్య‌క్తి గ‌ద్ద‌ర్ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. గ‌ద్ద‌ర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించిన గ‌ద్ద‌ర్‌ ఉన్న‌త కొలువుల వైపు దృష్టిసారించ‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి కూడు, గూడు, నీడ ల‌భించాలనే ల‌క్ష్యంతో జీవితాంత త‌న పాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర్చార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

Read also: Director Suicide: ఓయో రూమ్ లో GST సినిమా డైరెక్టర్ ఆత్మహత్య..!

తెలంగాణ జ‌న స‌మితి, తెలంగాణ జ‌న స‌భ‌తో పాటు ప‌లు ఉద్య‌మ సంస్థ‌ల ఏర్పాటుతో తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మానికి ఊపిరులూదిన వారిలో అగ్ర‌గ‌ణ్యుడు గ‌ద్ద‌ర్ అని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. పాట‌ను తూటాగా మార్చిన ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ అని, ఆయ‌న చేసిన సాంస్కృతిక‌, సాహితీ సేవ‌కు గుర్తింపుగా నంది అవార్డుల‌ను గ‌ద్ద‌ర్ అవార్డులుగా త‌మ ప్ర‌భుత్వం మార్చింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ‌ద్ద‌ర్‌తో త‌న‌కు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గద్దర్ వద్దంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమోషన్ ట్వీట్ చేయండంతో వైరల్ గా మారింది.

Bangladesh Protest : బంగ్లాదేశ్‎కు నాయకత్వం వహించనున్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్