Site icon NTV Telugu

Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

Revannth Reddy Harish Rao

Revannth Reddy Harish Rao

Revanth Reddy Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. గన్ మెన్ లు లేకుండా రా.. మూసీ, మల్లన్న బాధితులకు వద్దకు వెళదాం.. నేనే కారు నడుపుతా అని హరీష్ రావు మాటలకు ఇవాళ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి కి వస్తావా.. మురికి వాడికి వస్తావా అని సవాల్ చేస్తున్నారు.. ఇప్పుడు మూసి పక్కనే ఉన్న నేను.. హరీష్ రావు నీలాంటి చెప్పులు మోసేటోడు పిలిస్తే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో బోర్లా పడుకున్న వారిని రమ్మను నేను వస్తా.. నీతో స్థాయి నీతో బతుక అన్నారు. హరీష్ నీ సంగతి నాకు తెలవదా.. మా కాంగ్రెస్ దయ తలిస్తేనే గండిపేటలో ఫామ్ హౌజ్ కొనుక్కునే పరిస్థితికి వచ్చావన్నారు. హవాయి చెప్పులతో తిరిగిన నువ్వు ఇంతకీ ఎలా ఎదిగావు? నేను నీ వెనకాల ఉండి తొంగి తొంగి చూడొచ్చు.. కానీ నీలాగా నేను దొంగతనాలు చేయలే అన్నారు.

నా ఇంటి ముందు నిలబడి చేతులు కట్టుకొని బిచ్చమెత్తిన రోజులు మర్చిపోయావా? చెప్పులు కొనుక్కోవాలన్న నా ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డ రోజులు మర్చిపోయినవ్ అన్నారు. హైడ్రా మూసివైపు ఇంతవరకు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. హైడ్రా పని వేరు.. మూసి పునరుద్జీవం వేరన్నారు. కేటీఆర్ హరీష్లు ఎప్పుడైనా నా ఫామ్ హౌస్ కి రా అని సవాల్ చేశారా? ఎప్పుడు మూసికి రా అని సవాల్ చేస్తున్నారని తెలిపారు. మూసి ప్రజల్ని అడ్డుపెట్టి వాళ్ళ ఫామ్ అవుతుల్ని కాపాడుకునే పనిలో ఉన్నారన్నారు. ముందు మీ రెండు ఫాం హౌస్ లో దగ్గర నిజనిర్ధారణ కమిటీ వేద్దాం అన్నారు. నిన్న హరీష్ చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. నీ వెనకాల నిక్కి నిక్కి చూడొచ్చు…కానీ నీలాగా దొంగతనం చేయలేదని తెలిపారు.
Revanth Reddy: ఎవరు అడ్డు వచ్చిన అక్రమార్కుల సంగతి ఖచ్చితంగా తేల్చుడే..

Exit mobile version