NTV Telugu Site icon

CM Revanth Reddy: అంతర్జాతీయ యువజన దినోత్సవం.. రాష్ట్ర యువతకు సీఎం శుభాకాంక్షలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్ధేశకులు కావాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు. తెలంగాణ యువత రాణించేలా ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ తీసుకుందని సీఎం తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, పెడదారులను నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదితర నిర్ణయాలు అందులో భాగమే అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read also: MLC Kavitha: కవితకు నో బెయిల్‌.. విచారణ ఆగస్టు 20 కి వాయిదా..

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా చేరుకున్నారు. పదిరోజుల ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి ఏడు రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా రేవంత్ వెంట దక్షిణ కొరియా వెళ్లారు. అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసిందని రేవంత్ పేర్కొన్నారు. అమెరికాకు కొత్త తెలంగాణను పరిచయం చేశామని రేవంత్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న అమెరికా భారీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై హైకోర్టులో పిటిషన్‌..