CM Revanth Reddy: హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాం..
- ISB లీడర్‌షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి ..
- గచ్చిబౌలి లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లో లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం..
- హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ISB లీడర్‌షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గచ్చిబౌలి లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లో లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన అన్నారు. ISB లీడర్‌షిప్ సమ్మిట్‌లో మీ అందరిని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఐఎస్ బీ ఈ యేడాది ఎంచుకున్న లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా థీమ్ పైన తన ఆలోచనలను మీతో పంచుకుంటానని అన్నారు. ఐఎస్ బిలో చదువుకుంటున్న మీరంతా యువకులు, తెలివైనవారు, అసాధారణ విద్యార్థులు అని తెలిపారు. నా జీవితం, రాజకీయాల నుంచి నేను నాయకత్వం గురించి నేర్చుకున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉందని సీఎం తెలిపారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి వి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణగా వ్యాఖ్యానించారు. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యమన్నారు. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమని అన్నారు.
Read also: KA Paul: నన్ను చంపితే స్వర్గానికి పోతా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమని తెలిపారు. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చని అన్నారు. దేశంలోని గొప్ప నాయకులు, మన కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా ధైర్యం , త్యాగం అనే రెండు విలువల గురించి ఆలోచించాలని సూచించారు. మీకు ధైర్యం ఉంటే, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు విజయం సాధిస్తారని అన్నారు. ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలని.. పేదలు, ధనికులు ,చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తు స్నేహ భావంతో అందరిని కలుపుకుపోవాలన్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరని అన్నారు. ISB విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణ తో పాటు న్యూ ఇండియా కు బ్రాండ్ అంబాసిడర్‌లు అన్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జిడిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మాలక్ష్యం అని తెలిపారు.
Read also: Ap-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలన్నారు. తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాలన్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు , సామాన్య ప్రజలతో తెలంగాణ ,హైదరాబాద్ గురించి మాట్లాడండి అని తెలిపారు. భారతదేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని నేను కోరుకోవడం లేదన్నారు. న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో , సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యం. కాని అసాధ్యం కాదన్నారు. మా ప్రభుత్వంతో మీరు రెండు మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను .మీకు పెద్ద జీతాలు ఇవ్వలేకపోయినా మంచి అవకాశాలు, పెద్ద సవాళ్ళను ఇస్తా అన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గచ్చిబౌలి లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని శుభవార్త చెప్పారు సీఎం. తాను (రేవంత్) సౌత్ కొరియా లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ని సందర్శించానని గుర్తుచేశారు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్ లో అనేక పథకాలు సాధించిందన్నారు. మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పథకం కూడా సాధించలేకపోయిందన్నారు. నా లక్ష్యం ఒలింపిక్స్ మనం పథకాలు సాధించడం అన్నారు. హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన అన్నారు.
Health Benefits: తిప్పతీగ ఆకు తింటే తిప్పలన్నీ మాయం..
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!