Site icon NTV Telugu

Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్‌ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..

Sitarama Project

Sitarama Project

Sitarama Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసే సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెంలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. పంప్ హౌస్ మోటార్లను సీఎం రేవంత్ ఆన్ చేసి డెలివరీ సిస్టర్న్ వద్ద గోదారమ్మకు పూజలు చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకుంటారు.

Read also: DSC Recruitment Process: సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ప్రారంభించిన అనంతరం వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ను రెండు రోజుల క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 11న పూసుగూడెం, కమలాపురం పంపుహౌస్‌లను మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ -2 ట్రయల్ రన్ ను మంత్రులు ప్రారంభించారు.
Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..

Exit mobile version