NTV Telugu Site icon

Telangana Schools: అలర్ట్.. తెలంగాణ ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు..

Telangana Schools

Telangana Schools

Telangana Schools: ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్కూల్ యాజమాన్యం సోమవారం నుంచి పనివేళలు మార్పులు చేర్పులు ఉంటాయని వెల్లడించింది. పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయాన్ని సూచించింది. సోమవారం నుంచి పాఠశాల పనివేళల మార్పులు ఉన్నట్లు వెల్లడించింది. ఒకవైపు తెలంగాణలో బోనాలు, మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రస్తుతం అమలు చేస్తున్న స్కూల్ టైమ్స్ కొనసాగుతాయని వెల్లడించింది.

Read also: CM Revanth Reddy: కొత్త పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంలో పలు రాష్ట్రాట్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో.. గోవా, కర్నాట‌క‌, కేర‌ళ‌లోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులను ప్రకటించిన విషయం విదితమే కాగా.. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాలో కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంది.. మరికొన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం.. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.. ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించింది విద్యాశాఖ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్టు డీఈవో ఓ ప్రకటనలో పేర్కొన్నారు..
MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు.. వివ‌రాలివే..