Site icon NTV Telugu

Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు..

Omc

Omc

Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. ఇక, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్‌ కృపానందాన్ని నిర్దోషులుగా తేల్చింది. అయితే, 2004- 2009 వరకు గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే, ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీని నిర్దోషిగా తేల్చింది.

Read Also: Pakistan: అంతర్జాతీయంగా ఏకాకి, ఛీ కొడుతున్న మిత్రులు.. పహల్గామ్ తర్వాత పాక్ పరిస్థితి..

ఇక, ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ1 శ్రీనివాస్ రెడ్డి, A2 గాలికి జనార్ధన్ రెడ్డి, A3 వీడీ రాజగోపాల్‌, A7 మెఫజ్‌ అలీఖాన్‌లను దోషులుగా పేర్కొంది. ఇక, శ్రీనివాస్ రెడ్డి, గాలికి జనార్ధన్ రెడ్డి, గాలి పీఏకు లక్ష రూపాయల జరిమానాతో పాటు అందరికీ ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.

Read Also: Zero Shadow : 9 రోజుల దాకా నీడ మాయం.. ఎందుకంటే..?

అయితే, ఈ సందర్భంగా గాలి జనార్ధాన్ రెడ్డి మాట్లాడుతూ.. నా వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తుంచి శిక్ష తగ్గించాలని కోరాగా.. పది సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని గాలిని సీబీఐ జడ్జి ప్రశ్నించారు. మీరు యావ జీవ శిక్షకు అర్హులని తేల్చి చెప్పారు న్యాయమూర్తి. ఇక, తన సామాజిక సేవ ఇప్పటికే నాలుగు సంవత్సరాల పైబడి ఉంది.. ఈ నేపథ్యంలో శిక్ష తగ్గించాలని గాలి జనార్ధన్ రెడ్డి కోరారు. బళ్లారితో పాటు గంగావతిలో తనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను ప్రజా సేవ చేస్తుండటంతో ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని గాలి జనార్ధాన్ రెడ్డి తెలిపారు.

Exit mobile version