Hydra: సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా చేపట్టిన విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్,బఫర్ జోన్ లలో నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పలువురు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు వెంకటేష్,లక్ష్మీ,సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Read also: Fake Doctor: వైద్యుడి అవతారం ఎత్తిన ల్యాబ్ టెక్నీషియన్..!
మరోవైపు చిన్నచితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇళ్ళను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏమిటని సున్నం చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం రోడ్డుపైకి వచ్చిన బాధితులు ఒక్కసారిగా దిగారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇళ్ళను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను ఆందోళన దిగిన బాధితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్