NTV Telugu Site icon

Telangana Assembly 2024: అంసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక..

Aseembly Cag

Aseembly Cag

Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవాళ తొమ్మిదవ రోజు అసెంబ్లీ సభ కొనసాగతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చివర రోజు కావడంతో మూడు బిల్లులపై చర్చ కొనసాగుతుంది. మొదటగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సివిల్‌ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం సీతక్క వీడియో మార్ఫింగ్ అంశంపై సభలో చర్చ కొనసాగింది. సభలో ఉద్యోగ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించడమే కాకుండా చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కాగా.. ఇవాళ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేక పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ముందుకు వచ్చింది. రెవిన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు ఉన్నాయని తెలిపారు.

Read also: Sexual Harassment: ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..?

పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం పై చేశారన్నారు. 1983 – 2018 మధ్య కాలంలో 20సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే వాటి పై 1లక్ష 73వేల కోట్లు కాగా.. మొదటి అంచాన వ్యయం 1లక్ష కోట్లు నుండి.. 2లక్షల కోట్లకు పెరిగిందని తెలిపింది. ద్రవ్యలోటు పరిమితులకు లోబడి ఉందన్నారు. ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు భారీగా ఉన్నాయని, వాటా అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. కాళేశ్వరం మిషన్ భగీరథ కే ఎక్కువ రుణాలు.. తీసుకున్న రుణాలు.. చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ చెల్లించడానికి.. బడ్జెట్ యేతర రుణాలను తిరిగి చెల్లించడానికి ఇబ్బంది ఎర్పడిందన్నారు. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్నారని తెలిపింది. గత సంవత్సరం బడ్జెట్ లో పన్నెత్తర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారన్నారు. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58శాతం, ఎస్టిలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదన్నారు. ఖర్చు అయిన ఎస్సి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారిమల్లించారని కాగ్ నివేదిక లో వెల్లడించారు.
Chhattisgarh : కుక్క కాటుతో చనిపోయిన ఆవులు… వాటి పాలను విక్రయించిన యజమాని

Show comments