Site icon NTV Telugu

Shamshabad Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్.. భయాందోళనలో ప్రయాణికులు..

Indigo

Indigo

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదరాబాద్ నుండి చండీగర్ వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. వెంటనే విమానాన్ని క్షుణంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో 130 మంది ప్రయాణికులను కిందకు దింపి విమానాన్నిసెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కాల్ తో ప్రయాణికులు భయ భ్రాంతులకు గురయ్యారు. అత్యవసరంగా విమానం నిలిపివేయడంతో ప్రయాణికులు బిక్కు బిక్కు మంటూ ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. పోలీసులు, అధికారులు ప్రయాణికులను దైర్యంతో ఉండాలని, భయపడాల్సిన పని లేదని తెలిపారు. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు ఎవరు కాల్ చేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Air Pollution: దయచేసి బయట ఎక్కువగా తిరగొద్దు.. ఢిల్లీలో గాలి నాణ్యత బాగా లేదు..

Exit mobile version